పల్లెబాట పట్టిన ఓటర్లు.. సిటీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల పోలింగ్ కావడంతో హైదరాబాద్ లో ఉంటున్న పల్లెజనం సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలో నగరం సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు భారీగా తరలివెళ
ట్రాఫిక్ జామ్


హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల

పోలింగ్ కావడంతో హైదరాబాద్ లో ఉంటున్న పల్లెజనం సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలో నగరం సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు భారీగా తరలివెళుతుండడంతో చౌటుప్పల్ దగ్గర హైవేపై భారీగా వాహనాలు దర్శనం ఇస్తున్నాయి.

మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లోనూ ప్రజలు తరలివెళుతుండటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎల్బీనగర్ లో భారీగా ట్రాపిక్ జామ్ నెలకొంది. అంతే కాకుండా హయత్ నగర్ నుండి వనస్థలిపురం, భాగ్యలత వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇక హైదరాబాద్ కు దూరంగా ఉన్న జిల్లాల ప్రజలు ఇప్పటికే బస్సుల్లో, ట్రైన్లలో ఇతర ప్రైవేటు వాహనాల్లో తమ సొంతూళ్లకు బయలుదేరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande