
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు
బాహాబాహీకి దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఏక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగ్రామం అయిన ఎక్లాస్ఫైన్పేట్లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తన మద్దతుదారులను వార్డు సభ్యులుగా నిలబెట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ అనుచరులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో మాజీ ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్సీ అనుచరుల కారును ధ్వంసం పూర్తిగా ధ్వజమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్సీ అనుచరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు