మలక్పేటలో దోపిడీ దొంగల బీభత్సం.. భారీగా నగదు, బంగారం అపహరణ
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) నగరంలో మరోసారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మలక్పేట ఆఫీసర్స్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి జరిగిన ఈ చోరీలో రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారంతో పాటు 40 తులాల వెండిని కూడా దొంగలు అపహర
దొంగల ముఠా


హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)

నగరంలో మరోసారి దోపిడీ దొంగలు

బీభత్సం సృష్టించారు. మలక్పేట ఆఫీసర్స్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి జరిగిన ఈ చోరీలో రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారంతో పాటు 40 తులాల వెండిని కూడా దొంగలు అపహరించారు. అయితే, చోరీకి పాల్పడింది నేపాలీ ముఠా నే అని పోలీసులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీ దొంగల కోసం బృందాలుగా విడిపోయి తీవ్రంగా గాలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande