ఆనంద్ మహీంద్రపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో ఆనంద్ మహీంద్రా, చిరంజీవి గారు కలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోను మహీంద్రా స్వయంగా సోషల్ మీడియా (X) లో షేర్ చేస్తూ మెగాస్టార్ను ఆకాశానికెత్తేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ స
మెగాస్టార్ చిరు


హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో

ఆనంద్ మహీంద్రా, చిరంజీవి గారు కలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోను మహీంద్రా స్వయంగా సోషల్ మీడియా (X) లో షేర్ చేస్తూ మెగాస్టార్ను ఆకాశానికెత్తేశారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. విజన్ 2047 గురించి సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించాను. చివర్లో మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం ఊహించని సర్ప్రైజ్. ఆయన ఒక లెజెండ్. కానీ ఆయనలో ఉన్న వినయం, నిజమైన ఆసక్తి మరింత ఆకట్టుకున్నాయి. నేర్చుకోవాలనే ఉత్సుకత, వినయంతో వినడం ఏ రంగంలోనైనా శాశ్వత విజయానికి పునాది అని రాసుకొచ్చారు.

అయితే మహీంద్రా కామెంట్పై చిరు కూడా స్పందించారు.

డియర్ ఆనంద్ మహీంద్రా మీరు ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం ఎంతో ఆదర్శనీయం. మీరు చాలా సార్లు రతన్ టాటాని గుర్తుకు తెస్తారు. ఆయన తన విలువతో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. మీరు కూడా అలానే. సేవా కార్యక్రమాలలో మీరు చూపుతున్న నిబద్ధత ఎంతో మందికి ఆదర్శం. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చిరంజీవి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande