వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్
ములుగు, 11 డిసెంబర్ (హి.స.) రెండవ సాధారణ గ్రామ పంచాయతీ మొదటి విడత జరుగుతున్న ఎన్నికలను ములుగు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర్ టీఎస్ కలెక్టర్ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావుతో కలిసి పోలింగ
ములుగు కలెక్టర్


ములుగు, 11 డిసెంబర్ (హి.స.)

రెండవ సాధారణ గ్రామ పంచాయతీ మొదటి విడత జరుగుతున్న ఎన్నికలను ములుగు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర్ టీఎస్ కలెక్టర్ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావుతో కలిసి పోలింగ్ బూతులను పరిశీలిస్తూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవంతరాలు, ఇబ్బందులు ఏర్పడకుండా ఓటర్లకు అన్ని ఏర్పాట్లు చేసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నిక పూర్తి అయిన వెంటనే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించాలని, విజేతలను ప్రకటించిన అనంతరం ఉపసర్పంచ్ లను వెంటనే ఎన్నుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande