మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో మోడీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్షపాత్ర పోశించడం లేదని అసంతృ
మోడీ సీరియస్


హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని

మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో మోడీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్షపాత్ర పోశించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనకబడటంపై అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు. ఇకనైనా విబేధాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవుపలికారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా అసదుద్దీన్ సోషల్ మీడియా టీమ్ యాక్టివ్ గా పనిచేస్తోందని ఉదాహరించారు.

ఎంపీల తీరు మారాలని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని హితబోధ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande