
జోగులాంబ గద్వాల, 11 డిసెంబర్ (హి.స.)
గద్వాల జిల్లా ధరూర్ మండల
కేంద్రంలో ఈ నెల 6వ తేదీన ఫ్రిజ్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగా వారిలో చికిత్స పొందుతూ తల్లి, 11 నెలల చిన్నారి కన్నుమూశారు. మరో మహిళకు చికిత్స కొనసాగుతోంది. కాగా ఈ నెల 6వ తేదీన ధరూర్ మండల కేంద్రంలో మూసి ఉన్న షాపు నుండి పొగలు రావడంతో గమనించిన అశ్విని, సునీత అనే మహిళలు షాపు షెటర్ తెరిచారు. ఒక్కసారిగా ఫ్రిజ్ పేలడంతో ఇద్దరు మహిళలతో పాటు వారితో ఉన్న 11నెలల బాబు తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే స్థానికులు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ తరలించారు. ఫ్రిజ్ లో ఉండే కంప్రెసర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..