
భద్రాద్రి కొత్తగూడెం, 11 డిసెంబర్ (హి.స.) మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా బూర్గంపాడు మండలంలో అధికారులు, స్థానిక రిపోర్టర్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు, పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని, స్థానిక విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎన్నికల అధికారి ఉద్దేశపూర్వకంగా రిపోర్టర్లను అవమానించే పరిస్థితి సృష్టించారని విలేకరులు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల సమాచారం పై అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, రిపోర్టర్లను గందరగోళానికి గురిచేస్తున్న అధికారి ఎవరు? అంటూ విలేకరులు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని పలు కేంద్రాల వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని రిపోర్టర్లు ఆరోపిస్తున్నారు. పోలీసు సీఐ కూడా పోలింగ్ కేంద్రం లోనికి రిపోర్టర్లను అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని వాపోయారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు