
అనంతపురం, 11 డిసెంబర్ (హి.స.)జిల్లాలోని కేఎస్ఆర్ కళాశాల ప్రాంగణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరిగ్గా చదవట్లేదనే ఒత్తిడిని తట్టుకోలేక నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం కేఎస్ఆర్ కళాశాల హాస్టల్‌లో ఉంటున్న నలుగురు విద్యార్థినులు చదువుపై సరిగా దృష్టి సారించడం లేదని కళాశాల వార్డెన్ వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థినులు హేయిర్ డై రసాయనాన్ని సేవించి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన కళాశాల సిబ్బంది హుటాహుటిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కళాశాలలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆ నలుగురు విద్యార్థినులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఈ సంఘటనలో మరో ఆందోళనకర అంశం ఏమిటంటే, ఆత్మహత్యాయత్నం చేసిన నలుగురిలో ముగ్గురు విద్యార్థినులు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఉన్నారు. చదువుల ఒత్తిడి కారణంగానే వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని తోటి విద్యార్థులు, స్థానికులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV