ధర్మవరం నుంచి 'అటల్–మోదీ సుపరిపాలన బస్సు యాత్ర' ప్రారంభం
ధర్మవరం, 11 డిసెంబర్ (హి.స.) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ''అటల్–మోదీ సుపరిపాలన బస్సు యాత్ర'' నేడు (ఈరోజు) ధర్మవరం నుండి అట్టహాసంగా ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. బీజ
bus-yatra-begins-from-dharmavaram-


ధర్మవరం, 11 డిసెంబర్ (హి.స.)

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అటల్–మోదీ సుపరిపాలన బస్సు యాత్ర' నేడు (ఈరోజు) ధర్మవరం నుండి అట్టహాసంగా ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రవ్యాప్త యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర ద్వారా దేశ ప్రజలను వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములుగా చేయాలనే లక్ష్యాన్ని పార్టీ ప్రజల్లోకి తీసుకుపోనుంది. ఈ బస్సు యాత్ర ప్రారంభ బహిరంగ సభ కోసం ధర్మవరంలో అన్ని ఏర్పాట్లు ఘనంగా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగించే ప్రధాన సభ ప్రారంభానికి ముందే, వేదికపై కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. బస్సు యాత్ర ప్రారంభ సభను విజయవంతం చేయడానికి బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande