అదోనిలోని మరో జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
ఆదోని, 11 డిసెంబర్ (హి.స.) కర్నూలు జిల్లా ఆదోనిలోని (Adoni) మరో జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం (Fire Accident In Jinning Mill) చోటు చేసుకుంది. ఎన్డీబీఎల్ జిన్నింగ్ మిల్లులో ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలంటుకొని మిల్ అంతటా వ్యాప
ginning-mill-in-adoni-


ఆదోని, 11 డిసెంబర్ (హి.స.)

కర్నూలు జిల్లా ఆదోనిలోని (Adoni) మరో జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం (Fire Accident In Jinning Mill) చోటు చేసుకుంది. ఎన్డీబీఎల్ జిన్నింగ్ మిల్లులో ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలంటుకొని మిల్ అంతటా వ్యాపించాయి. మంటలు వ్యాప్తితో మిల్లులోని పత్తికి కూడా నిప్పు అంటుకుంది. దీంతో కార్మికులు దిక్కు తోచని పరిస్థితులకు వెళ్లిపోయారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. అగ్ని ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించింది. మంటలు వ్యాప్తి చెందకుండా తొలుత చర్యలు తీసుకొని, ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande