
హైదరాబాద్, 12 డిసెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొలవరం నీటిని బొల్లాపల్లి, నల్లమల సాగర్ జలాశయాలకు తరలించడమే లక్ష్యంగా పొలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు పేరును మార్చి పొలవరం-నల్లమల సాగర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్లను ఇటీవల విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏపీ సర్కారు నిర్మించ తలపెట్టిన పొలవరం-నల్లమల సాగర్ సాగునీటి ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో అభ్యంతరాలు నిర్ణయించిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసుుల వాదించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కోరినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పొలవరం-బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై సన్నాహక సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2.30కి అభిషేక్ మను సింఘ్వీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..