కళ్ళల్లో కారంకొట్టి సర్పంచ్ అభ్యర్థిపై దాడి.
కరీంనగర్, 13 డిసెంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. శంకరపట్నం మండలం మొలంగూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేయడానికి వచ్చిన వారిని గుర్తుపట్టకుండా ముందుగా కొము
సర్పంచ్ అభ్యర్థి పై దాడి


కరీంనగర్, 13 డిసెంబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. శంకరపట్నం మండలం మొలంగూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేయడానికి వచ్చిన వారిని గుర్తుపట్టకుండా ముందుగా కొమురయ్య కళ్లలో కారం పొడి చల్లి దాడికి తెగబడ్డారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించి వస్తుండగా.. అటాక్ చేశారు. కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande