రేవంత్‌రెడ్డి సీఎం కాదు… ఈవెంట్ మేనేజర్! ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై ఈటల రాజేందర్ విమర్శలు..
హనుమకొండ, 13 డిసెంబర్ (హి.స.) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యలను పక్కనబెట్టి ప్రభుత్వం ఈవెంట్‌ల నిర్
ఈటెల


హనుమకొండ, 13 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యలను పక్కనబెట్టి ప్రభుత్వం ఈవెంట్‌ల నిర్వహణకే పరిమితమైందని ఆరోపించారు.

“రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాదు… ఒక ఈవెంట్ మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సింగరేణి సంస్థ నిధులను ప్రజా సంక్షేమానికి కాకుండా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఖర్చు చేయడం దారుణమని మండిపడ్డారు.

క్వార్టర్ల మరమ్మతులకు, ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు రూ.100 కోట్లతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఇది ప్రజాధనాన్ని వృథా చేయడమేనని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande