
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)
మితిమీరిన టికెట్ ధరలు, అధిక
ధరలకు స్నాక్స్ విక్రయాలతో థియేటర్లు సమాన్య ప్రజల జేబులకు గుల్లా చేస్తున్నాయని, సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్లను ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విడుదలైన ఒక్కరోజేనే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా పైరసీ బయటకు రావడంం పై ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితుడు ఐ బొమ్మ రవిని ఉరి తీయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, అలా చేసినా సినిమాల పైరసీ ఆగదన్నారు. అలా అయితే రవి పోలీస్ కస్టడీలో ఉండగానే అఖండ-2 మూవీ ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు.
అసలు పైరసీకి మూలం ఎక్కడుంది... అందుకు సంబంధించి సమూల ఆధారాలు ఎక్కడ లభ్యం అవుతాయో కనిపెట్టాలన్నారు. వ్యవస్థీకృతమైన లోపాల వల్లే పైరసీ పుట్టుకొస్తోందని కామెంట్ చేశారు. కేవలం టికెట్ ధరలు పెంచుకోవాలి, లాభాలు రాబట్టుకోవాలి అంటే ఎలా కుదురుతుందని ఫైర్ అయ్యారు. ప్రజలపై భారం మోపడం వల్లే వాళ్లు ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారని.. అందుకే థియేటర్లకు జనం రావట్లేదని సీపీఐ నారాయణ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..