
తెలంగాణ, 13 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.
మరో మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఏకంగా 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
అలాగే ఐదు జిల్లాల్లో 12 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపింది. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. అక్కడ కేవలం 5.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదు అవుతున్నాయట. సంగారెడ్డి, ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు