భోజనం లేదు.. నీరు లేదు.. ఎన్నికల విధుల్లో సిబ్బంది నిరసన
ఖమ్మం, 13 డిసెంబర్ (హి.స.) ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తాగు నీరు, భోజనాలు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వచ్చిన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచిలో చోటుచేసుకుంది. సుమార
ఎన్నికల సిబ్బంది నిరసన


ఖమ్మం, 13 డిసెంబర్ (హి.స.)

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తాగు నీరు, భోజనాలు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వచ్చిన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచిలో చోటుచేసుకుంది. సుమారు 1500 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వస్తే తమకు భోజనాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ, ఎంపీవోల పై నిరసన వ్యక్తం చేశారు. భోజనాల సంగతి అటు నుంచి తమకు కనీసం త్రాగునీరు కూడా ఏర్పాట్లు చేయలేదని ఇక్కడే ఇలా ఉంటే ఎన్నికల విధుల్లో అన్ని ఏర్పాట్లు చేయగలరా అని అనుమానాలు వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande