వైసిపి అఫ్జరంలో ఉండగా అవినీతి జరిగిందంటూ చంద్రబాబు నాయుడు పై ఫైబర్నెట్ కేసు నమోదైంది
అమరావతి, 13 డిసెంబర్ (హి.స.)వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లోఅవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపైనమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్‌చి
వైసిపి అఫ్జరంలో ఉండగా అవినీతి జరిగిందంటూ చంద్రబాబు నాయుడు పై ఫైబర్నెట్ కేసు నమోదైంది


అమరావతి, 13 డిసెంబర్ (హి.స.)వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లోఅవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపైనమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 2014-19 నడుమ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో నిబంధనలను ఉల్లంఘించి వివిధ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల కార్పొరేషన్‌కు రూ.114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. నాటి ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేమూరి హరికృష్ణ, ఎండీ కె.సాంబశివరావు, టెర్రాసాఫ్ట్‌ డైరెక్టర్‌ తుమ్మల గోపాలకృష్ణ, చంద్రబాబు (ఏ-25), ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులను నిందితుల జాబితాలో చేర్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande