ఇండియా చేరుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.) ది GOAT టూర్ కార్యక్రమంలో భాగంగా ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ నేటి తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు. తొలి దశగా ఆయన కొలకత్తా చేరుకోవడంతో అభిమానుల్లో అమితానందం వెల్లివిరిసింది. 14 ఏళ్ల విరామం తర్వాత మ
ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి


హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)

ది GOAT టూర్ కార్యక్రమంలో భాగంగా ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ నేటి తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు. తొలి దశగా ఆయన కొలకత్తా చేరుకోవడంతో అభిమానుల్లో అమితానందం వెల్లివిరిసింది.

14 ఏళ్ల విరామం తర్వాత మెస్సీ భారత పర్యటన జరుపుతుండటంతో, విమానాశ్రయం నుంచి హోటల్ వరకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. మెస్సీ పర్యటనలో భాగంగా కొలకత్తాతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande