
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)
మెస్సితో ఫుట్ బాల్ ఆడేందుకు కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాస్టల్ పిల్లలకు మాత్రం తిండి పెట్టడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన యాడ్స్ లో తెలంగాణ రైసింగ్ హాస్పిటల్స్ లో విద్యార్థులు ఫాలింగ్ అన్నట్లగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది విజన్ 2047 కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్ 2047 గా మారిందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీకి ఫుట్ బాల్ మ్యాచ్ మీద ఉన్న శ్రద్ధ చనిపోతున్న రైతులు, విద్యార్థుల మీద లేదన్నారు. బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఇవాళ హరీష్ రావు పరామర్శించారు. విద్యార్థులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు