
ఖమ్మం, 13 డిసెంబర్ (హి.స.)
రెండో విడత గ్రామ పంచాయతీ
ఎన్నికలకు 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే పోలీస్ బలగాలు చేరుకున్నాయని అన్నారు. ప్రజల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ఓటరు పోలింగ్ కు కదిలేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి తగిన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో అడిషనల్ డీసీపీల పర్యవేక్షణలో పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు