
అమరావతి, 13 డిసెంబర్ (హి.స.)
,:మాజీ మంత్రి కొడాలి నానికి కార్మికశాఖ మంత్రి సుభాష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతోషం కోసం కొడాలి నాని నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడారని మండిపడ్డారు. రెడ్ బుక్ పేరెత్తితేనే గజగజ లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అవాకులు చవాకులు పేలాటం ఎందుకు ఇప్పుడు డైపర్లు వేసుకు తిరగడం ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు. పులులు, సింహాలు అంటూ ఇప్పుడు గ్రామ సింహాలుగా మారిపోయారంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ముందు యోగా, వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకో అంటూ కొడాలి నానికి హితవుపలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ