
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)
కాలానుగుణంగా మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బ్రెయిన్ ఫీడ్ గ్రూప్ ఆధ్వర్యంలో హైటెక్స్లో నిర్వహించిన ఈటీ టెక్ ఎక్స్ 6వ ఎడిషన్ కార్యక్రమానికి శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా విద్యారంగాన్ని అత్యున్నత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ఉపాధ్యాయుల భర్తీ, డిజిటల్ లెర్నింగ్, స్కిల్ ఎడ్యుకేషన్ వరకు విద్యారంగంలోని ప్రతిదశలో సమగ్ర మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..