మాట నిలబెట్టుకున్న మంత్రి వాకిటీ శ్రీహరి..
నారాయణపేట, 13 డిసెంబర్ (హి.స.) తన వద్ద పాలేరుగా పనిచేసి నమ్మకంగా సేవలందించిన ఆంజనేయులుకు మంత్రి వాకిటీ శ్రీహరి ఆర్టీసీ బస్టాండ్లో ఉపాధి కల్పించారు. శనివారం టీ కొట్టు ప్రారంభించుకునేలా కిరాయి నమూనా పత్రాన్ని అందజేశారు. తనను నమ్ముకుని కష్టపడిన ప్ర
మంత్రి వాకిటి శ్రీహరి


నారాయణపేట, 13 డిసెంబర్ (హి.స.)

తన వద్ద పాలేరుగా పనిచేసి నమ్మకంగా సేవలందించిన ఆంజనేయులుకు మంత్రి వాకిటీ శ్రీహరి ఆర్టీసీ బస్టాండ్లో ఉపాధి కల్పించారు. శనివారం టీ కొట్టు ప్రారంభించుకునేలా కిరాయి నమూనా పత్రాన్ని అందజేశారు. తనను నమ్ముకుని కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడం తన నైతిక ధర్మమని భావించిన మంత్రి వాకిటీ శ్రీహరి, మక్తల్ ఆర్టీసీ బస్టాండ్లో టీ కొట్టు ఏర్పాటు చేసుకునేందుకు డిపో మేనేజర్తో మాట్లాడి నెలవారీ కిరాయిగా స్థలం కేటాయించేందుకు సిఫారసు చేశారు. దీనికి సంబంధించిన అనుమతి ఉత్తర్వులు తీసుకొచ్చి పాలేరుకు అందజేసి ఉపాధి కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande