ఓటర్లకు అనుగుణంగా నూతన డివిజన్లు ఏర్పాటు చేయాలి: జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరిన ఎమ్మెల్యే గూడెం
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.) నియోజకవర్గ పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా, ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని బల్దియా కార్యాలయంలో కమిషనర్ ఆర్ వి కర్ణన్ను కలిసి నూతన డివి
పటాన్చెరు ఎమ్మెల్యే


హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)

నియోజకవర్గ పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా, ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని బల్దియా కార్యాలయంలో కమిషనర్ ఆర్ వి కర్ణన్ను కలిసి నూతన డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలను నివేదిక రూపంలో అందించారు. ప్రజలు, పుర ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన అభ్యంతరాలను, సలహాలను కమిషనర్కు వివరించారు.

ప్రధానంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో లక్ష 20 వేలకు పైగా ఓటర్లు, రెండు లక్షల జనాభా నివసిస్తుందని, పాత అమీన్పూర్ మండలం, అమీన్పూర్ మున్సిపల్ కలిపి కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేశారని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ, సౌలభ్యం కోసం కిష్టారెడ్డిపేట, బీరంగూడ, అమీన్పూర్, పిజిఆర్ కాలనీల పేరిట 30 వేల ఓటర్లకు అనుగుణంగా నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande