
రామగుండం, 13 డిసెంబర్ (హి.స.)
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫేజ్-1
సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం సెక్షన్ 163 BNSS ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం తెలిపారు. కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ రెండో విడత పాలకుర్తి, అంతర్గం, జూలపల్లి, ధర్మారం మండలాలలో మంచిర్యాల జోన్ పరిధిలో బెల్లంపల్లి, కన్నేపల్లి, భీమిని, తాండూర్, నెన్నెల, కాసిపేట్, వేమనపల్లి మండలాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సెక్షన్ 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 5 మంది అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదని, సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఈ ఉత్తర్వులు 12 తేదీ నుంచి 14 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడి వరకు అమలులో ఉంటుందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు