
జయశంకర్ భూపాలపల్లి, 13 డిసెంబర్ (హి.స.)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో శనివారం దారుణ ఘటన జరిగింది. సీతారాంపూర్ గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50)అనే వ్యక్తి ఆయన భార్య సంధ్య (42ను ఉరివేసి చంపి అనంతరం ఆయన కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామాచారి మొదటి భార్య చనిపోగా ఆయన సంద్యను రెండో పెళ్లి చేసుకున్నారు. భార్యను చంపిన అనంతరం వీడియో తీసి రామాచారి స్టేటస్ పెట్టుకున్నారు. ఈ సంఘటనతో సీతారామపురం గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు