
సిద్దిపేట, 13 డిసెంబర్ (హి.స.)
ఎన్నికల విధులు సక్రమంగా
నిర్వహించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో జనార్ధన్ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల డ్యూటీలు ఎవరు సక్రమంగా నిర్వహించకుంటే వారిని విధుల నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..