
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)
సంక్రాంతికి ఊరేళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ ను దక్షిణ మధ్య రైల్వే రేపటినుండి ఓపెన్ చేయనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచే ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవతాయని రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే ముందస్తు బుకింగ్స్ చేసుకోవాలని పిలుపునిచ్చింది.
కాగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతిని పెద్ద పండుగగా పిలుచుకుంటున్నారు. ఈ పండగ చేసుకునేందుకు దేశంలో ఉన్న ఏపీ వాళ్లంతా సొంతూళ్లకు వెళతారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..