వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజన్సీకి ఏపీ మంత్రి నిమ్మల హెచ్చరిక
దోర్నాల, 13 డిసెంబర్ (హి.స.)పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని, చేయలేకపోతే తప్పుకోవచ్చని వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. మోసం, దగా అనే పదాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్
nimmala-ramanayudu-warns-veligonda-


దోర్నాల, 13 డిసెంబర్ (హి.స.)పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని, చేయలేకపోతే తప్పుకోవచ్చని వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. మోసం, దగా అనే పదాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన విమర్శించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రాజెక్టులోని రెండో టన్నెల్‌లో దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించి పనుల పురోగతిని మంత్రి నిమ్మల క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కీలక పనులు పెండింగ్‌లో ఉండగానే, అప్పటి సీఎం జగన్ పైలాన్ ఏర్పాటు చేసి జాతికి అంకితం పేరుతో డ్రామా ఆడారని అన్నారు. వెలిగొండ నీటితో తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తల్లినీ, చెల్లినీ మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసగించడం ఒక లెక్కా? అని ఆయన అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande