సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
గుంతకల్లు, 13 డిసెంబర్ (హి.స.)సంక్రాంతి పండగ, శబరిమల యాత్రల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారు
outh-central-railway-announces-10-more-sabarimala-special-trains


గుంతకల్లు, 13 డిసెంబర్ (హి.స.)సంక్రాంతి పండగ, శబరిమల యాత్రల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

సంక్రాంతి పండగ కోసం సికింద్రాబాద్-అనకాపల్లి (07041) మధ్య జనవరి 4, 11, 18 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి-సికింద్రాబాద్ (07042) మధ్య జనవరి 5, 12, 19 తేదీల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. అలాగే హైదరాబాద్-గోరఖ్‌పూర్ (07075) మధ్య జనవరి 9, 16, 23 తేదీల్లో, గోరఖ్‌పూర్-హైదరాబాద్ (07076) మధ్య జనవరి 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. వీటితో పాటు మచిలీపట్నం-అజ్మీర్ (07274) మధ్య ఈ నెల 21న, అజ్మీర్-మచిలీపట్నం (07275) మధ్య ఈ నెల 28న కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande