అనంతపురం జీజీహెచ్‌ లో ఉద్రిక్తత.. కార్మిక సంఘాల ఆందోళన
అనంతపురం, 13 డిసెంబర్ (హి.స.) అనంతపురం (Anantapur) గవర్నమెంట్ జనరల్ హాస్పిట్ (జీజీహెచ్) లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికులు నిరసన చేపట్టడంతో ఒక్కసారిగా పరిసరాలు వేడెక్కాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అదుపు చేసే ప్రయత్నం మొ
/tension-in-anantapur-ggh-trade-unions-concerned-


అనంతపురం, 13 డిసెంబర్ (హి.స.) అనంతపురం (Anantapur) గవర్నమెంట్ జనరల్ హాస్పిట్ (జీజీహెచ్) లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కార్మికులు నిరసన చేపట్టడంతో ఒక్కసారిగా పరిసరాలు వేడెక్కాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అదుపు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. పోలీసుల ప్రమేయంతో కార్మికులు మరింత ఆగ్రహానికి గురై వారితో వాగ్వాదానికి దిగారు. శానిటరీ కార్మికులకు అన్యాయం జరిగిందని.. వారికి న్యాయం చేసే వరకు నిరసనను నిలిపేది లేదని నినదించారు.

వివరాల్లోక వెళ్తే జీజీహెచ్ హాస్పిటల్లో ఇటీవల శానిటరీ కార్మికులను తొలగించారు. దీని పై కార్మిక సంఘాల గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శానిటరీ కార్మికుల తొలగింపును నిరసిస్తూ కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టాయి. దీంతో ఒక్కసారిగా జీజీహెచ్ (GGH) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే శానిటరీ కార్మికుల తొలగింపునకు వ్యతిరేక పద్మావతి (50) అనే కాంట్రాక్టు కార్మికురాలు ఆత్మహత్యకు యత్నించడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లుగా పరిస్థితులు మారాయి. దీంతో ఆగ్రహానికి గురైన కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు నేరుగా జీజీహెచ్ లోని అవుట్ సోర్సింగ్ కార్యాలయానికి చేరుకుని దాడికి యత్నించారు. అవుట్ సోర్సింగ్ సంస్థ మేనేజర్ సాయిపై కూడా దాడికి పాల్పడ్డారు. దాడితో భయపడిన అవుట్ సోర్సింగ్ సంస్థ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులు రంగంలోకి దిగిన పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన విరమించుకునేది లేదని కార్మిక నేతలు స్పష్టం చేశారు. ముఖ్యంగా తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కాంట్రాక్టు కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతనాలు, ఇతర ప్రయోజనాలు సక్రమంగా చెల్లించకపోవడం, కొత్త ఏజెన్సీల విధానాలతో కార్మికులు అభద్రతాభావానికి లోనవుతున్నారని సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande