
నిజామాబాద్, 14 డిసెంబర్ (హి.స.)
రెండవ విడత సాధారణ గ్రామ
పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులకు, అభ్యర్థులకు, ఓటర్లకు సూచించారు. ఆదివారం నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద గల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. పోలీస్ సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు పరిశీలన చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు