కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం
గుడివాడ: 14 డిసెంబర్ (హి.స.) కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్‌ సెంటర్‌లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో భారీగా మంటలు చెలరేగాయి. తొలుత సెల్‌ఫోన్‌ దుకాణంలో వచ్చిన మంటలు.. క్రమంగా మిగతా షాపులకు వ్యా
కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం


గుడివాడ: 14 డిసెంబర్ (హి.స.)

కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్‌ సెంటర్‌లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో భారీగా మంటలు చెలరేగాయి. తొలుత సెల్‌ఫోన్‌ దుకాణంలో వచ్చిన మంటలు.. క్రమంగా మిగతా షాపులకు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. ఇదే కాంప్లెక్స్‌లో జూనియర్‌ కళాశాల, ఎస్‌బీఐ శాఖలు ఉన్నాయి. ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande