చలిని సైతం లెక్క చేయక ఓటు వేసేందుకు వీల్ చైర్లో వచ్చిన వృద్ధులు..
కరీంనగర్, 14 డిసెంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా ఆయా గ్రామాల్లో వృద్ధులు చలిని సైతం లెక్క చేయకుండా వీల్ చైర్లో వచ్చి మరీ తమ ఓటు హక్కును
ఎలక్షన్స్ కరీంనగర్


కరీంనగర్, 14 డిసెంబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్

మండలంలోని పలు గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా ఆయా గ్రామాల్లో వృద్ధులు చలిని సైతం లెక్క చేయకుండా వీల్ చైర్లో వచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని రేణికుంట గ్రామంలో 90 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి రాగా అక్కడి అధికారులు, సిబ్బంది ఆమెను వీల్ చైర్లో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లగా ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. పర్లపెల్లి గ్రామంలో కూడా వృద్ధులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి రాగా అధికారులు వారికి పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande