
మహబూబ్నగర్, 14 డిసెంబర్ (హి.స.)
రెండవ విడత గ్రామ పంచాయతీ
ఎన్నికలు జరుగుతున్న మహబూబ్నగర్ జిల్లాలోని హన్వాడ మండలంలో లింగన్నపల్లి, వేపూరు హన్వాడ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు.
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. మండలంలోని 35 గ్రామ పంచాయతీలకు గాను ఒక గ్రామ పంచాయతీ దాచక్ పల్లి ఏకగ్రీవం కాగా మిగతా 34 గ్రామ పంచాయతీల్లో ఆదివారం ఉదయం నుంచి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. హన్వాడ మండలం వ్యాప్తంగ మధ్యాహ్నం 12:30 గంటల వరకు 63.38 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..