మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. కోడలిని గొంతు పిసికి చంపిన ఆ నలుగురు
మహబూబాబాద్, 14 డిసెంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లాలోని కొమ్ముగూడెం గ్రామంలో గత రాత్రి హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త, మామ, భర్త, మరిది కలిసి కోడలిని గొంతు పిసికి హత్య చేసినట్లు సమాచారం. అయితే మృతురాలికి ఇద్దరు చిన్న పి
మర్డర్


మహబూబాబాద్, 14 డిసెంబర్ (హి.స.)

మహబూబాబాద్ జిల్లాలోని కొమ్ముగూడెం గ్రామంలో గత రాత్రి హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త, మామ, భర్త, మరిది కలిసి కోడలిని గొంతు పిసికి హత్య చేసినట్లు సమాచారం. అయితే మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో ఈ ఘటన మరింత విషాదంగా మారింది. హత్యానంతరం నిందితులైన నలుగురు ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande