విజయవాడలో జరిగిన మిస్నంద్ర టీనేజి విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన సహస్ర ద్వితీయ స్థానంలో
అమరావతి, 14 డిసెంబర్ (హి.స.) ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన మిస్‌ ఆంధ్రా టీనేజీ విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన సహస్ర రాణించి ద్వితీయ స్థానంలో నిలిచింది. తవణంపల్లె మండలం అరగొండకు
విజయవాడలో జరిగిన మిస్నంద్ర టీనేజి విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన సహస్ర ద్వితీయ స్థానంలో


అమరావతి, 14 డిసెంబర్ (హి.స.)

ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన మిస్‌ ఆంధ్రా టీనేజీ విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన సహస్ర రాణించి ద్వితీయ స్థానంలో నిలిచింది. తవణంపల్లె మండలం అరగొండకు చెందిన యువతి తల్లిదండ్రులు పల్లవి, శ్రీధర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. సహస్ర బెంగళూరులో ఓర్‌కిడ్జి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఫ్యాషన్‌ టెక్నాలజీ, క్రికెట్‌లో శిక్షణ పొందుతూ ఈ పోటీల్లో పాల్గొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande