
నారాయణపేట, 14 డిసెంబర్ (హి.స.)
నారాయణ పేట మండలంలోని సింగారం గ్రామ పంచాయతీలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 25 వ పోలింగ్ కేంద్రంలో పదో వార్డు బూత్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉదయం 8:25 గంటలకు పోలింగ్ కేంద్రానికి ఓటు వేశారు. అనంతరం అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బందితో మాట్లాడి పోలింగ్ సరళిని పరిశీలించారు. సింగారం గ్రామంలోని పదో వార్డు పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని కలెక్టర్ మీడియాకు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు