నేడు రెండో విడత ఎన్నికలు.. 192 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీల్లో..
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రెండో విడత ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. 192 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్
రెండో విడత ఎన్నికలు


హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రెండో విడత ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. 192 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 57.22 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande