
నాగర్ కర్నూల్, 14 డిసెంబర్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల పరిధిలోని అవంచ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు చంద్రకళ, సౌమ్య వర్గీయులు పోలింగ్ కేంద్రం సమీపంలోనే బాహాబాహీకి దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ పరస్పర దాడులలో ఇద్దరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం సమీపంలోని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు