పంచాయతీ ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.. సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి
మెదక్, 14 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగి పరిధిలోని పెద్ద తండా లో ఓ సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామంలో ప్రత్యర్థి ఓటుకు రూ.2 వేలు చొప్పున డబ్బులు ప
సర్పంచ్ అభ్యర్థి


మెదక్, 14 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగి పరిధిలోని పెద్ద తండా లో ఓ సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామంలో ప్రత్యర్థి ఓటుకు రూ.2 వేలు చొప్పున డబ్బులు పంపిణీ చేశారని, తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఆరోపిస్తూ అభ్యర్థి సెల్ టవర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా స్పాట్కు చేరుకుని అభ్యర్థిని బుజ్జగించి కిందకు దించే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థులు డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని సదరు అభ్యర్థి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో పెద్ద తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande