పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్
సంగారెడ్డి, 14 డిసెంబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆదివారం రెండో విడత ఓటింగ్ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని ఆందోల్, పుల్కల్, వట్పల్లి, చౌటకూర్, రాయికోడు, మునిపల్లి మండలాల పరిధిలోని 134 సర్పంచ్, 1168 వా
సంగారెడ్డి కలెక్టర్


సంగారెడ్డి, 14 డిసెంబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా

ఆదివారం రెండో విడత ఓటింగ్ ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని ఆందోల్, పుల్కల్, వట్పల్లి, చౌటకూర్, రాయికోడు, మునిపల్లి మండలాల పరిధిలోని 134 సర్పంచ్, 1168 వార్డు స్థానాలకు గాను అధికారులు 1212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్దకు ఓటర్లు ఉదయం ఏడు గంటల నుంచే ఓటు వేసేందుకు తరలివచ్చారు. ఇదిలా ఉండగా చౌటకూరు మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆమెతో పాటు ఆర్ డి ఓ పాండు వున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande