
తెలంగాణ, 14 డిసెంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా పంచాయతీ ఎన్నికలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్ లో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ స్థానానికి దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు నిన్న(శనివారం) సాయంత్రం ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున మృతి చెందాడు. ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా, సర్పంచ్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు