
సంగారెడ్డి, 14 డిసెంబర్ (హి.స.)
నేడు జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని వివిధ గ్రామాల్లో తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఓటర్లు ఉదయం 7 గంటల కంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బర్దిపూర్, ఝరాసంగం, కృష్ణాపూర్, పొట్టి పల్లి, ఏడాకులపల్లి తదితర గ్రామాల్లో గ్రామీణ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు తరలివచ్చారు. మండల వ్యాప్తంగా మొత్తం 33 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో ఇప్పటికే రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 31 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్ద గ్రామాలైన ఎల్గోయి, ఝరాసంగం, కుప్పా నగర్ తదితర గ్రామాల్లో ఒకే గదిలో రెండు నుంచి మూడు వార్డులకు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడంతో ఓటర్లు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు