
వనపర్తి, 14 డిసెంబర్ (హి.స.)
ఆదివారం కొత్తకోట మండలం
కనాయిపల్లి గ్రామంలో వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఐపీఎస్ పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించి వివిధ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధులు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై ఎస్పీ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..