
వనపర్తి, 14 డిసెంబర్ (హి.స.) వనపర్తిజిల్లాలోని ఆమరచింత, ఆత్మకూరు, మదనపురం, కొత్తకోట, వనపర్తి మండలాలలో రెండోవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు కొసాగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదర్శ్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల సరళిని, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఓటు వేసేందుకు వచ్చిన వయోవృద్ధులు, వృద్ధులకు సైతం అధికారులు సిబ్బందితో వీల్ చైర్ల సౌకర్యం కల్పించారు.
కాగా మధ్యాహ్నం 12 గంటల వరకు వనపర్తి జిల్లాలో 45.4 ఓటింగ్ శాతం నమోదు అయిందని కలెక్టర్ పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు