చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ ప్రమాణం..
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.) మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ భారత కేంద్ర సమాచార కమిషన్ (CIC) ప్రధాన సమాచార కమిషనర్గా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారిచే పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో నిర
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్


హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)

మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్

గోయల్ భారత కేంద్ర సమాచార కమిషన్ (CIC) ప్రధాన సమాచార కమిషనర్గా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారిచే పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో నిరాడబరంగా జరిగింది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, తదితరులు హాజరయ్యారు.

కాగా, 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. గతంలో హోంశాఖలో బోర్డర్ మేనేజ్మెంట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఈ నియామకంతో సుమారు 9 ఏళ్ల తర్వాత కేంద్ర సమాచార కమిషన్ పూర్తి స్థాయి సామర్థ్యంతో పని చేయనుంది. గత సెప్టెంబర్లో హీరాలాల్ సమరియా పదవీ కాలం ముగియడంతో సీఐసీ పోస్టు ఖాళీ అయింది. అదనంగా 8 మంది కొత్త సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వారంతా అతి త్వరాలోనే కొత్త సీఐసీ ముందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాలు సమాచార హక్కు చట్టం అమలులో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడానికి దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande