
అమరావతి, 15 డిసెంబర్ (హి.స.):వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ( పర్సనల్ అసిస్టెంట్ చిన్న అపన్నకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా కేసులో పీఏ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి వ్యవహారంలో చిన్న అప్పన్న డెయిరీల నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరిపి చిన్న అప్పన్నను అరెస్ట్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ