బాలు గళం అక్షయపాత్ర : వెంకయ్య నాయుడు
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.) ప్రసిద్ధ తెలుగు సినీ గాయకుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ నేడు రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు,బాలు చెల్లెలు శైలజ, ఆమె భర్త శుభలేఖ
బాలు విగ్రహం


హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)

ప్రసిద్ధ తెలుగు సినీ గాయకుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ నేడు రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు,బాలు చెల్లెలు శైలజ, ఆమె భర్త శుభలేఖ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేవుడు స్వార్థపరుడని ఆవేదన వ్యక్తం చేసారు. ముందు ఘంటసాలను, తర్వాత బాలసుబ్రమణ్యంను తీసుకెళ్లారని అన్నారు.స్వరసార్వభౌమత్వానికి బాలసుబ్రహ్మణ్యం నిదర్శనమని కొనియాడారు. బాలు గళం దర్శకుడు కోరుకున్నది ఇచ్చే అక్షయపాత్రలాంటిదని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అలాంటి గాన గంధర్వుడు మన మధ్య లేకపోవడం విచారకరం అని విచారం వ్యక్తం చేసారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande